సినిమా అంటే థియేటర్ కి వెళ్లాలి. బాక్సాఫీస్ వద్ద టికెట్ కొనాలి. పాప్ కార్న్ తింటూ చూడాలి. పెద్ద తెరపై చూసిన దాని గురించి పెద్ద డిస్కషన్ చేస్తూ ఇంటికి తిరిగి రావాలి. ఇదంతా ఒకప్పుడు. కరోనా దెబ్బతో ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ అన్నట్టుగా మారింది సీన్! లాక్ డౌన్స్ వల్ల థియేటర్లు మూతపడుతూ, తెరుచుకుంటూ గందరగోళంగా ఉండటంతో… ఓటీటీలు పండగ చేసుకుంటున్నాయి. పెద్ద నిర్మాతలకే పెద్ద పెద్ద ఆఫర్లు ఇస్తున్నాయి! కాదనలేని రేటు చెప్పి…