సినిమా అంటే థియేటర్ కి వెళ్లాలి. బాక్సాఫీస్ వద్ద టికెట్ కొనాలి. పాప్ కార్న్ తింటూ చూడాలి. పెద్ద తెరపై చూసిన దాని గురించి పెద్ద డిస్కషన్ చేస్తూ ఇంటికి తిరిగి రావాలి. ఇదంతా ఒకప్పుడు. కరోనా దెబ్బతో ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ అన్నట్టుగా మారింది సీన్! లాక్ డౌన్స్ వల్ల థియేటర్లు మూతపడుతూ, తెరుచుకుంటూ గందరగోళంగా ఉండటంతో… ఓటీటీలు పండగ చేసుకుంటున్నాయి. పెద్ద నిర్మాతలకే పెద్ద పెద్ద ఆఫర్లు ఇస్తున్నాయి! కాదనలేని రేటు చెప్పి కలకలం సృష్టిస్తున్నాయి!
విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తోన్న తొలి ప్యాన్ ఇండియా చిత్రం ‘లైగర్’! ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్ ఏకంగా 200 కోట్లు ఇస్తామంటోందట, అన్ని రకాల రైట్స్ ని కలుపుకుని! ప్యాండమిక్ కాలంలో ఈ ఆఫర్ నిజంగా తీవ్రంగా ఆలోచింపజేసేదే!
Read Also : “హీరో” రికార్డులు మొదలయ్యాయి…!?
మన తెలుగు స్టార్ హీరో నటించిన మరో ప్యాన్ ఇండియా చిత్రం ‘రాధే శ్యామ్’. ‘బాహుబలి’ ప్రభాస్ ఉండటంతో దీనిపై చాలా అంచనాలున్నాయి. అయితే, 350 కోట్ల వరకూ బడ్జెట్ అంచనాలున్న ఈ సినిమాకి 400 కోట్లు ఇస్తామంటున్నారట! పెద్ద జ్యూసీ ఆఫర్ కాకపోయినా ప్యాండమిక్ టైంలో ప్యాన్ ఇండియా మూవీకి 400 కోట్లు సేఫ్ అమౌంటే అంటున్నారు ఎక్స్ పర్ట్స్!
‘లైగర్, రాదేశ్యామ్’ ఇంత వరకూ ఓటీటీ రిలీజ్ ని కన్ ఫర్మ్ చేయలేదు. కానీ, అజయ్ దేవగణ్ ‘భుజ్’ సినిమా 112 కోట్లకు ఆల్రెడీ అమ్ముడుపోయింది. డిస్నీ హాట్ స్టార్ లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్ట్రీమింగ్ అవ్వొచ్చంటున్నారు. అజయ్, సోనాక్షి, ప్రణీత నటించిన వార్ యాక్షన్ ఫిల్మ్ ‘భుజ్’పై భారీ అంచనాలే ఉన్నాయి.
Read Also : బీస్ట్ మోడ్ లో అక్కినేని హీరో వర్కౌట్లు…!
కార్తీక్ ఆర్యన్ ‘ధమాకా’ సినిమా 85 కోట్ల భారీ డీల్ కుదుర్చుకుంది నెట్ ఫ్లిక్స్ తో. ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. సైఫ్, అర్జున్ కపూర్, జాక్వలిన్, యమీ గౌతమ్ నటించిన ‘భూత్ పోలీస్’ 45 కోట్లకు ఓటీటీ వేదిక మీదకి చేరింది. ఈ సినిమా కూడా ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో తెలియదుగానీ… ‘భూత్ పొలీస్’ నిర్మాత పబ్లిక్ గానే తాను ఓటీటీ ఆఫర్ తో లాభపడ్డట్టు అంగీకరించాడు!
సౌత్ డైరెక్టర్ ప్రియదర్శన్ బాలీవుడ్ మూవీ ‘హంగామా 2’ కూడా 30 కోట్ల ధర పలికింది. డిస్నీ హాట్ స్టార్ ఈ కామెడీ సీక్వెల్ ని స్వంతం చేసుకుంది. సీనియర్ నటులు పరేశ్ రావల్, శిల్పా శెట్టితో పాటూ యంగ్ కపుల్ మీజాన్ జాఫ్రీ, ప్రణీత సుభాష్ కూడా ఈ సినిమాలో ఉన్నారు.