Indian Box Office Report: 2022లో ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్లు 10 వేల కోట్ల రూపాయల మార్క్‌ను చేరుకున్నాయి. నవంబర్‌కు సంబంధించిన ఇండియన్ బాక్సాఫీస్ రిపోర్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ నెలలో.. హిందీలో వచ్చిన దృశ్యం-2 మూవీ అన్ని భాషల చిత్రాల కన్నా ఎక్కువ వసూళ్లు రాబట్టింది. ఈ ఒక్క పిక్చర్ మాత్రమే నవంబర్‌లో వంద కోట్ల రూపాయల కలెక్షన్ల మార్క్‌ను క్రాస్ చేయటం విశేషం.
The Indian Box Office Report-September 2022: మన దేశంలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. ఇలా పలు ఫిల్మ్ ఇండస్ట్రీలు ఉన్నాయి. వాటి నుంచి ప్రతి వారం, ప్రతి నెలా ఎన్నో సినిమాలు విడుదలవుతున్నాయి. వాటిలో కొన్ని మూవీలు అలా వచ్చి ఇలా పోతున్నాయి. చాలా కొద్ది పిక్చర్లు మాత్రమే హిట్ అవుతున్నా భారీగా కలెక్షన్లు కురిపిస్తున్నాయి. అందుకే.. ఇండియన్ బాక్సాఫీస్ రిపోర్టుకు బిజినెస్‌పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది.