ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల వ్యవహారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారిపోయింది.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇచ్చిన జీవోను హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ కొట్టివేయడంతో.. ఇది మరింత చర్చకు దారితీసింది. సింగిల్ బెంచ్ తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను సంప్రదించిన సంగతి తెలిసిందే కాగా… ఇవాళ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. సినిమా టికెట్ల ధరలపై ఇవాళ మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు.. గతంలో ఉన్న కమిటీలో లోటు పాట్లను సరి చేసి…
ప్రజల ప్రయోనాల కోసం సినిమా టికెట్ల ధరలు అందరికీ అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం జీవో 35ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ జీవోతో సినిమా డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు ఏపీ హైకోర్టు ఆశ్రయించారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ల పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు ఉందని తెలుపుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో 35ను రద్దు చేస్తూ తీర్పనిచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం…
గత కొన్ని రోజులుగా ఏపీలో టికెట్ల రేట్లపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల ఏపీ ప్రభుత్వం ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపుపై లేదంటూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తీరును సవాల్ చేస్తూ హైకోర్టు పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు టికెట్ల రేట్లను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో రద్దు చేస్తున్నట్లు తీర్పునిచ్చింది. పాత రేట్లు వర్తిస్తాయని హైకోర్టు వెల్లడించింది. ఈ…
గత కొన్ని రోజులు ఏపీలో సినిమా టికెట్ల ధరల చుట్టూ చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడ ప్రభుత్వం టికెట్ల ధరను తగ్గించడం మాత్రమే కాకుండా బెనిఫిట్ షో లను రద్దు చేస్తూ కేవలం రోజుకు నాలుగు షోలు మాత్రమే వేయాలని స్పష్టం చేసింది. అలాగే టికెట్లు కూడా ఆన్లైన్ లో విక్రయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక తాజాగా టికెట్ల ధరలు పెంచేందుకు థియేటర్లకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. కానీ ఇది ఏపీలో కాదు.. తెలంగాణలో. తాజాగా…
ఏపీ మంత్రి పేర్నినాని సినీ ప్రముఖులతో నేడు సమావేశం నిర్వహించారు. చిత్ర పరిశ్రమకు చెందిన ఆదిశేషగిరిరావు, యువి క్రియేషన్స్ వంశీ, దిల్ రాజు, ఎన్వీ ప్రసాద్, సి. కళ్యాణ్, డివివి దానయ్య, మైత్రీ మూవీ మేకర్స్ రవి, నవీన్, పంపిణీదారులు ఎల్వీఆర్, సత్యనారాయణ, వీర్రాజు, అలంకార్ ప్రసాద్, ఒంగోలు బాబుతో పాటు పలువురు థియేటర్ల యజమానులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాగా, ఈ సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకొంది. ఓ సినిమా థియేటర్ యజమాని సినిమా టిక్కెట్…
సినిమా టికెట్లు ప్రభుత్వమే విక్రయించడం పై కాపు ఉద్యమనేత ముద్రగడ సీఎం జగన్ కు లేఖ రాసారు. అయితే సినిమా టికెట్లు ఆన్ లైన్ లో విక్రయించడం మంచిదే అని చెప్పిన ఆయన… మాజీ సినిమా ఎగ్జిబిటర్ గా మరికొన్ని సూచనలు చేస్తున్నాను అని తెలిపారు. సినిమా టిక్కెట్ల తరహాలోనే హీరో,హీరోయిన్ల పారితోషకాలు ఆన్ లైన్ లోనే చెల్లించాలి. సినిమాకు చేసే ఖర్చును నిర్మాత నుంచి ప్రభుత్వం ముందుగా బ్యాంక్ లో జమ చేయించుకోవాలి. ప్రభుత్వం ద్వారానే…
ఆన్లైన్ టిక్కెట్ల అమ్మకంపై ఈ నెల 20న సమావేశం నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం. దీనిపై చర్చించేందుకు.. సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలను ఆహ్వానించింది. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు అమ్మే అంశంపై అభిప్రాయాలు, సలహాలు తీసుకోనుంది. ఆన్ లైన్ టిక్కెట్ల అమ్మకం సొమ్మును రియల్ టైంలో ట్రాన్స్‌ఫర్ చేస్తామని ఈ సమావేశంలో ప్రభుత్వం స్పష్టం చేయనుంది. ఇప్పటికే పలువురు నిర్మాతలు.. సినీ ప్రముఖులు, థియేటర్ ఓనర్లతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక, ఇవాళ మీడియాతో మాట్లాడిన మంత్రి పేర్ని…
టాలీవుడ్ కు.. ఏపీ సీఎం జగన్ షాక్ ఇచ్చి 2 రోజులు దాటుతోంది. సినిమా టికెట్లకు వెబ్ సైట్ ను అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం ప్రకటన ఇచ్చేసింది. తమ అదుపులోకి టాలీవుడ్ ను రప్పించుకునే దిశగా ఈ అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. ఈ విధానంపై.. థియేటర్ల యజమానులు అయోమయంలో పడ్డారు. వారితో పాటు.. సినిమా టికెట్ల ఆదాయాన్ని పంచుకునే అన్ని విభాగాల ప్రతినిధులు.. టెన్షన్ పడుతున్నారు. వెబ్ సైట్ పెట్టినందుకు.. ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరాల్సి ఉంటుంది.…
ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్లు అమ్మాలన్న ఏపీ ప్రభుత్వం ఆలోచన వెనక ఉద్దేశం ఏంటి? ఈ ప్రతిపాదన ఎవరు చేశారు? దీనివల్ల సర్కార్‌కు కలిగే ఉపయోగం ఏంటి? చిత్ర పరిశ్రమకు ఎలాంటి మెసేజ్ పంపారు? ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు అమ్మడంపై చర్చ! సినిమా టికెట్ల బుకింగ్‌కు సంబంధించి.. ఏపీ ప్రభుత్వం త్వరలోనే ఆన్‌లైన్ విధానంలో ఒక ప్రత్యేక పోర్టల్ తీసుకురావాలని చూస్తోంది. ప్రభుత్వమే సొంత పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్లను అమ్మాలన్నది నిర్ణయం. ఓ కమిటీని వేసి..…