ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలపై మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు విక్రయించాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం ఇకపై ప్రతి టికెట్‌పైనా 2 శాతం కమీషన్ వసూలు చేయనుంది. ఏపీ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా సినిమా టికెట్లను ప్రభుత్వం ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో.. ఇక నుంచి రాష్ట్రంలోని ఏ మూలన సినిమా చూడాలన్నా ఈ పోర్టల్ ద్వారానే టికెట్లను కొనుగోలు చేయాల్సిందే. ప్రైవేటు…