ఒడియా నటీనటులు నడివీధిలో జుట్టుపట్టుకుని కొట్టుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఒడియా నటుడు బాబుసన్ మొహంతి భార్య , సహనటి ప్రకృతి మిశ్రా పై దాడి దిగింది. ఈ ఘటన భువనేశ్వర్ లో చోటుచేసుకుంది. అయితే.. ఇంతకీ ఇదంతా ఇప్పుడెందుకు అంటే.. ఒడియా హీరోయిన్ ప్రకృతి మిశ్రా, హీరో బబుసన్ మెహంతి ప్రేమమ్ సినిమాలో కలిసి నటించారు. ఈనేపథ్యంలో ఉత్కల్ అసోసియేషన్ చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి వీళ్లిద్దరూ హాజరయ్యారు. కాగా.. మెహంతి…
నటి బ్రిగిడ సాగ సంచలన వ్యాఖ్యలు చేసారు. తను ఓ సినిమాలో నగ్నంగా నటించడానికి కారణం ఆయన కోసమే అంటూ వ్యాఖ్యలు చేసారు. దీంతో వార్త కాస్త సంచలనంగా మారింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పార్తిబన్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ఇరవిన్ నిళల్ దీని అర్థం (రాత్రినీడ). ఈ సినిమా జూలై 15న విడుదలై హిట్ టాక్ తో ముందుకు దూసుకుపోతోంది. అయితే ఈ మూవీలో నగ్నంగ నటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన యంగ్ బ్యూటీ…
‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ కొత్త సినిమా ‘హత్య’. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో డిటెక్టివ్ గా కనిపించనున్నాడు విజయ్ ఆంటోనీ. రితికా సింగ్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇది ఆసక్తికరంగా ఉండి సినిమా మీద ఉత్సుకతను పెంచుతోంది. లీలను ఎవరు హత్య చేశారనే కేసు పరిశోధన ఈ వీడియోలో చూపించారు. త్వరలో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.…
ప్రతాప్ పోతన్ అనగానే నటుడిగా అందరికీ గుర్తొచ్చే చిత్రం ‘ఆకలి రాజ్యం’, అలానే దర్శకుడిగా ‘చైతన్య’. నటుడిగా వైవిధ్యమైన పాత్రలు చేసిన ప్రతాప్ పోతన్ తెలుగులో చాలా కాలం గ్యాప్ తర్వాత ‘గ్రే’ సినిమాలో నటించారు. దానికి దర్శకుడు రాజ్ మాదిరాజు. యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రతాప్ పోతన్ హఠాన్మరణం ఆ చిత్ర బృందాన్ని షాక్ కు గురి చేసింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గ్రే సినిమా విడుదల కావాల్సి ఉంది. ఈ మూవీ ట్రైలర్…
అక్కినేని అఖిల్ లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ టీజర్ విడుదలైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ‘ఏజెంట్’తో బాలీవుడ్ బ్యూటీ సాక్షి వైద్య టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇక మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ విడుదల చేసిన టీజర్‌లో కూడా మమ్ముట్టీ ఎంట్రీతోనే మొదలైంది. ఆ తర్వాత ‘ఏజెంట్’ గురించి అతను చెప్పే మాటలతో అఖిల్ ఎంట్రీ జరిగింది. వైరి…
యంగ్ హీరో నిఖిల్, ప్రామిసింగ్ డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్‌లో ‘కార్తికేయ’కి సీక్వెల్ గా వస్తున్న ‘కార్తికేయ -2′ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు చక్కని స్పందన వచ్చింది. కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తూ విజయాలు సొంతం చేసుకుంటున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి. జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను జూలై…
సిద్దార్థ శ్రీ దర్శకత్వంలో మధుసూదన రాజు, ప్రతాప్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘కొండవీడు’. బిగ్ బాస్ ఫేమ్ శ్వేతావర్మతో పాటు ప్రతాప్ రెడ్డి, శ్రీకృష్ణ, నళినీకాంత్, నవీన్ రాజ్ ఇందులో కీలకపాత్రలు పోషించారు. ఈ నెల 8న మూవీ జనం ముందుకు వస్తున్న సందర్భంగా యూనిట్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. తొలుత నిర్మాత మధుసూదనరాజు మాట్లాడుతూ, ‘మూవీ టీజర్, ట్రైలర్ ను విడుదలచేసిన హీరోలు శ్రీకాంత్, సునీల్ కు ధన్యవాదాలు తెలిపారు. సినిమా షూటింగ్ సకాలంలోనే…
కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ నటిస్తున్న తాజా చిత్రం ‘రుద్రుడు’. ‘ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్, ఇట్ ఈజ్ క్రియేటెడ్’ అనేది దాని ట్యాగ్ లైన్. కతిరేశన్ దర్శకత్వంలో ఈ యాక్షన్ థ్రిల్లర్ ను ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్.ఎల్.పి. సంస్థ నిర్మిస్తోంది. దర్శకుడు కతిరేశన్ సమర్పకుడిగానూ వ్యవహరిస్తున్నారు. ఈ యేడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని గతంలో ప్రకటించిన చిత్ర బృందం తాజాగా విడుదల తేదీని ఖరారు చేసింది. డిసెంబర్ 23న ఈ మూవీని…