టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతోంది. హీరో సూర్య హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందిస్తున్న కొత్త సినిమా రేపు (మే 19, 2025) ఉదయం హైదరాబాద్‌లోని ప్రముఖ రామానాయుడు స్టూడియోలో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో యంగ్ అండ్ టాలెంటెడ్ నటి మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
READ MORE: Bandi Sanjay: దేశ వ్యాప్తంగా 102 రైల్వే స్టేషన్లు ప్రారంభించనున్న మోడీ.. తెలంగాణలోనూ మూడు..
వెంకీ అట్లూరి, తన రొమాంటిక్ అలాగే ఎమోషనల్ కథలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. సూర్యతో ఆయన చేస్తున్న ఈ కొత్త ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. సూర్య, తనదైన శైలిలో యాక్టింగ్‌తో ఈ సినిమాలోనూ మెప్పించనున్నారని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక మమిత బైజు, తన సహజమైన నటనతో ఇప్పటికే దక్షిణాది సినిమాల్లో గుర్తింపు పొంది ప్రేమలతో తెలుగు వారికి కూడా దగ్గరైంది… ఈ సినిమాలో ఆమె పాత్ర కూడా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది.
READ MORE: supritha : సురేఖ కూతురు సుప్రీతకు తీవ్ర అనారోగ్యం.. ఆస్పత్రి పాలు
ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాగవంశీ గత చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్న నేపథ్యంలో, ఈ సినిమాపై కూడా అందరి దృష్టి నెలకొంది. సినిమా ఓపెనింగ్ కార్యక్రమం రేపు రామానాయుడు స్టూడియోలో జరగనుండటంతో, సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.
ఈ సినిమా కథ, ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. సూర్య, వెంకీ అట్లూరి, మమిత బైజు కలయికలో రాబోతున్న ఈ చిత్రం ఖచ్చితంగా ఒక బిగ్ ఎంటర్‌టైనర్‌గా నిలిచే అవకాశం ఉంది.