మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ రాణా కుల నిర్ధారణ సర్టిఫికెట్ కేసులో నేడు సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది. నవనీత్ రాణా 2019లో ఎస్సీ కేటగిరిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచింది. కాకపోతే ఈ విషయంలో నవనీత్ రానా అందించిన ఎస్సీ సర్టిఫికెట్లు సరైనవి కాదని కొందరు బాంబే హైకోర్టులో కేసు వేశారు. ఈ విషయం సంబంధించి అప్పట్లో అయితే చర్చ జరిగింది. ఇందులో భాగంగానే కోర్టు ఆవిడకు రెండు లక్షల జరిమానాను కూడా విధించింది.…