Secunderabad: ప్రేమ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న యువతి కేసులో నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. తనను ప్రేమించమంటూ వెంటపడి, వేధించి, చివరకు యువతి మృతికి కారణమైన వాలీబాల్ కోచ్‌ను ఎట్టకేలకు అరెస్టు చేశారు. యువతి ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలియగానే.. వాలీబాల్ కోచ్ పారిపోయాడు. పరారీలో ఉన్న కోచ్‌కు సంబంధించిన పక్కా సమాచారం రావడంతో రైళ్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న యువకుడి పేరు అంబాజీ నాయక్. వాలీబాల్ కోచ్‌గా పని…
Drugs : డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బును హవాలా రాకెట్‌గా మారుస్తున్న గ్యాంగ్‌ను పట్టుకుంది తెలంగాణ ఈగల్ టీమ్. ముంబై కేంద్రంగా హవాలా రాకెట్ నడుపుతున్న కింగ్‌పిన్‌ను పట్టుకున్నారు. హవాలా రూపంలో నైజీరియన్ డ్రగ్ కార్టెల్స్‌కు డ్రగ్ మనీ పంపుతున్నట్లు గుర్తించారు పోలీసులు. పెద్దమొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ఈగల్ ఫోర్స్ మరో పెద్ద మాఫియా గుట్టురట్టు చేసింది. ముంబై కేంద్రంగా నడుస్తున్న హవాలా నెట్వర్క్‌ను చేధించడమే కాకుండా… హవాలా రాకెట్ నడుపుతున్న కింగ్‌పిన్‌ను పట్టుకున్నారు…
Engineering College : కాలేజీ లాకర్స్‌లో భద్రంగా దాచిన కోటి రూపాయల నగదు దోచుకెళ్లారు దొంగలు !! ఎవరికంటా కనపడకుండా లోపలికి దూరి.. లాకర్స్ బ్రేక్ చేసి మరీ దోచుకెళ్లారు !! 200 సీసీ కెమెరాలకు చెందిన డీవీఆర్‌ను కూడా ఎత్తుకెళ్లారు !! ఇదంతా వింటుంటే… ఏదో తేడాగా ఉందే ? అనిపిస్తోందా..? పోలీసులు కూడా ఇదే అనుమానిస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మేట్‌లోని బ్రిల్లియంట్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో జరిగిన దోపిడీ సంచలనం రేపుతోంది. ఇది అబ్దుల్లాపూర్‌మేట్‌లోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజ్.…
Love Story : ప్రేమ వేధింపులకు మరో యువతి బలైంది. చదువుతో పాటు అన్ని రంగాలలోనూ ఫస్ట్ ప్లేస్‌లో ఉండే ఆ యువతి.. ప్రేమ వేధింపుల కారణంగా తనువు చాలించింది. రోజు రోజుకు వేధింపులు మితిమీరుతుండటంతో.. తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఇటు వేధింపులు తట్టుకోలేక మనస్థాపానికి గురై.. చివరకు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఫోటోలో ఉన్న యువతి పేరు మౌనిక. లాలాగూడలోని రైల్వే డిగ్రీ కాలేజీలో బీఏ సెకండ్ ఇయర్ చదువుతుంది. మౌనిక కుటుంబం లాలాగూడలో నివాసం ఉంటోంది.…