Mouni Roy: బాలీవుడ్ హీరోయిన్ మౌనీ రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగిని సీరియల్ తో తెలుగువారికి కూడా సుపరిచితమైన ఈ భామ బ్రహ్మాస్త్ర సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. ఇక గతేడాది ఆమె తాను ప్రేమించిన సూరజ్ నంబియార్ ను వివాహమాడి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.