భార్య అంటే తనలో సగం. కష్టసుఖాల్లో తోడూనీడగా ఆమె భర్తకు వెన్నంటి వుంటుంది. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి వివాహం అనే మూడుముళ్ళు, ఏడడుగులతో భర్తతో పాటు పుట్టింటిని వదలి మెట్టినింటికి అడుగులు వేస్తుంది. అక్కడ ఏ కష్టం వచ్చినా భర్త అడుగుజాడల్లోనే నడుస్తోంది. భర్తకి కష్టం వస్తే ఆమె ఓదారుస్తుంది. భర్తతోటిదే లోకంగా బతుకుతుంది. కానీ, విధి వైచిత్రితో ఆ భార్య దూరం అయితే ఆ భర్త వేదనకు అంతే వుండదు. ఆమె గురుతులతో కాలం…