తెలంగాణలో ఉప ఎన్నిక వేడి బాగా రాజుకుంది. మరో రెండురోజుల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన టీఆర్ఎస్ 88 సీట్లు సాధించింది. ఆ తర్వాత పరిణామాలు అందరికీ తెలిసినవే. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకున్నారు. ఆతర్వాత జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక టీఆర్‌ఎస్‌ను ఇబ్బందుల్లోకి నెట్టిందనే చెప్పాలి. బలమైన స్థానంలో ఓటమి పాలయింది. దీంతో పతనం మొదలైపోయిందన్న మాటలు వినిపించాయి. అయితే ఆవెంటనే నాగార్జునసాగర్ ఉప ఎన్నికతో…