Gujatat : గుజరాత్‌లోని మోర్బీలో కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీ స్లాబ్ పడిపోవడంతో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే... అధికారులు సహాయం కోసం ఇక్కడకు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.
Fake Toll Plaza: నేరాల తీరు మారుతోంది. గతంలో ఇంటికి కన్నాలు వేసే పద్ధతిలో నేరాలు జరగడం లేదు. ఇప్పుడంతా సైబర్ దాడులు, టెక్నాలజీ ఆధారిత మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఇదిలా ఉంటే గుజరాత్‌లో జరిగిన ఓ నేరం గురించి తెలిస్తే, మోసగాళ్లు ఎంతగా తెలివిగా ప్లాన్ చేశారో తెలుస్తోంది. ఏకంగా ఓ హైవే ప్రత్యామ్నాయంగా రోడ్డు నిర్మించి నకిలీ టోల్‌ప్లాజాను ఏర్పాటు చేసుకుని దర్జాగా ఏడాదిన్నర పాటు దోపిడీ చేశారు. ఏకంగా ప్రభుత్వాన్ని మోసం చేయడం…
Gujarat: గుజరాత్ మోర్బీ జిల్లాలో దారుణంగా ప్రవర్తించింది ఓ యజమాని. తాను మహిళని మరిచిపోయి ఓ దళిత ఉద్యోగిపై కర్కషంగా వ్యవహరించింది. పెండింగ్‌లో ఉన్న జీతం ఇవ్వాలని అడిగినందుకు సదరు మహిళా యజమాని దళిత ఉద్యోగిపై దాడి చేయడమే కాకుండా.. ఆమె చెప్పులను నోటిలో పెట్టుకోవాలని హింసించింది. ఈ వ్యవహారంలో సదరు మహిళతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
గుజరాత్ లో ఘోర ప్రమాదం జరిగింది. మోర్బీలోని ఉప్పు కర్మాగారం గోడ కూలి 12 మంది కూలీలు దుర్మరణం చెందారు. హల్వాద్ జీఐడీసీ సాగర్ సాల్ట్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ సంఘటనలో 12 మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు. బస్తాల్లో ఉప్పు నింపే పనులు జరుగుతుండగా.. ఉన్నట్టుండి ఫ్యాక్టరీ ప్రహారీ గోడ కూలింది. కాగా.. మరణించిన వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. గోడ కింద మరింత మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 20 మంది…
దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ రేపు గుజరాత్ లో పర్యటించనున్నారు. మోర్బీలో నెలకొల్పిన 108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని మోడీ ఆవిష్కరిస్తారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ‘హనుమాన్జీ4ధామ్’ప్రాజెక్ట్ లో భాగంగా దేశ నలు దిక్కుల్లో నాలుగు హనుమాన్ విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా దేశానికి పడమర దిక్కున ఉన్న మోర్బీలోని…