జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామం వద్ద ఉద్రిక్తతత నెలకొంది. వరద బాధితులకు తక్షణ ఆర్థిక సహాయంగా లక్ష రూపాయలు అందజేయాలని డిమాండ్ చేస్తూ ధర్మ సమాధి పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
Support Moranchapalli: మోరంచ వాగు ఉధృతికి మునిగిపోయిన మోరంచపల్లి ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది. గురువారం తెల్లవారుజామున వాగు నీరు ముంచెత్తడంతో ప్రాణాలు అరచేత పెట్టుకుని చెట్టుకొకరు.. పుట్టకొకరుగా పరుగులు పెట్టిన ప్రజలు వెనక్కి తిరిగి వచ్చి చూసుకునేసరికి ఇళ్లన్నీ వట్టిపోయాయి.