CM Revanth Reddy : యాదాద్రి భువనగిరి జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. తుర్కపల్లి మండలంలో 66 వేల ఆయకట్టు లక్ష్యంగా నిర్మించబోతున్న గంధమల్ల రిజర్వాయర్ కు శంకు స్థాపన చేశారు. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్, యాదగిరిగుట్ట మెడికల్ కాలేజ్, వేద పాఠశాల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. కొలనుపాక-కాల్వపల్లి హైలెవెల్ వంతెన, మోటకొండూరులో ఎంపీపీ, మండలాఫీసు, పోలీస్…
DK Aruna : బీజేపీ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కు వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదని మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. తాజాగా ఆమె మాట్లాడుతూ, మూసీ ప్రక్షాళనపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ నీటిని శుద్ధి చేసి మంచి నీటిగా మార్చాలని తమకు వ్యతిరేకం లేదు అని ఆమె స్పష్టం చేశారు. అయితే, మూసీ ప్రక్షాళన పేరుతో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రణాళికను మాత్రమే బీజేపీ వ్యతిరేకిస్తోందని ఆమె…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవన సంకల్ప పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర యాదాద్రి జిల్లాలోని వలిగొండ మండలం, సంగెం గ్రామం నుంచి ప్రారంభమైంది. పాదయాత్రలో భాగంగా, సంగెం - భీమలింగం - ధర్మారెడ్డిపల్లి కెనాల్ - నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు 2.5 కిలోమీటర్ల మేర నడిచేలా సీఎం రేవంత్ రెడ్డి పథకాన్ని రూపొందించారు.