దేశంలో సంచలనం సృష్టించిన ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితుడైన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి మాన్సా కోర్టు ఏడు రోజుల పోలీసు కస్టడీని విధించింది. జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను బుధవారం తెల్లవారుజామున పోలీసులు మాన్సా కోర్టుకు తరలించారు. అతనికి మొదట వైద్య పరీక్షలు నిర్వహించి స్థానిక కోర్టులో హాజరుపరచగా.. అతనికి 7 రోజుల పోలీసు కస్టడీ విధించింది. పోలీసులు 10 రోజుల పోలీసు కస్టడీ కోరగా..…