Minister Anagani: రేపల్లెలోని మున్సిపల్ కార్యాలయంలో తుఫాన్ వరద ప్రభావంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొంథా తుఫాన్ ప్రభావాన్ని వీలైనంత వరకు తగ్గించడానికి కూటమి ప్రభుత్వం చేసిన కృషి ఒక చరిత్ర.. గత ఆరు రోజులుగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ మైక్రో లెవల్లో పర్యవేక్షించారు.
మొంథా తుపాను ఏపీ, తెలంగాణని వణికించింది. ఈదురుగాలులతో కుండపోత వర్షం కుమ్మేస్తోంది. గంటకు 93 కి.మీ. వేగంతో వీస్తున్నాయి. భీకర గాలులకు చరెల్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, నదులకు వరద నీరు పోటెత్తింది.
Hyderabad Rains: మొంథా తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్‌లో డతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాలు జలమయం కాగా, మలక్‌పేట్ మెట్రో స్టేషన్ పరిసరాలు పూర్తిగా నీటమునిగాయి. దిల్సుఖ్‌నగర్ నుంచి మలక్‌పేట్ వైపు వెళ్లే ప్రధాన రోడ్డుపై భారీగా నీరు నిల్వ ఉండటంతో వాహనాల రాకపోకలు తీవ్రంగా అంతరాయమయ్యాయి. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ, హైడ్రా టీమ్‌లు అక్కడికి చేరుకుని డ్రైనేజ్ వ్యవస్థను శుభ్రం చేస్తూ నీటిని బయటకు పంపే పనుల్లో నిమగ్నమయ్యాయి. మన్‌హోల్స్ తెరిచి వరద…