Telangana Rains : తెలంగాణలో వర్షాల హడావుడి మొదలైంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో మరింత విస్తరించడంతో వర్షాలు పలుచోట్ల కురుస్తున్నాయి. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని, ప్రధానంగా దక్షిణ , పశ్చిమ తెలంగాణలో వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల ప్రభావంతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Pawan Kalyan: లోయలోకి పవన్ కళ్యాణ్ పరుగులు.. అందుకేగా రియల్ హీరో అనేది!
శుక్రవారం నాడు ఉమ్మడి మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. మరోవైపు, హైదరాబాద్ నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా తడి మైదానాలు, చెట్ల కింద వర్షం సమయంలో నిలబడకూడదని సూచించింది. పిడుగులు పడే ప్రమాదం ఉండవచ్చని హెచ్చరించింది. వర్షాలకు అనుగుణంగా పునరావాస ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలున్నాయి.