రియల్ ఎస్టేట్‌లో నష్టాలు రావడంతో ఓ వడ్డీ వ్యాపారి 20 కోట్ల రూపాయలకు పైగా టోకరా పెట్టాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేటలో ఈ ఘటన కలకలం రేపుతుంది. వడ్డీ వ్యాపారిగా ఉన్న కూర్మదాసు హేమంత్.. కొత్తపేట మెయిన్ రోడ్ లో సత్య సూర్య బ్యాంకర్స్ ను ప్రారంభించి ఇందులో పార్టనర్ గా ఉన్నారు.. అయితే హేమంత్ తాకట్టు వడ్డీ వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా మరొకరితో భాగస్వామ్యగా ఉన్నారు.