మోహన్ లాల్ నటించిన ‘లూసిఫర్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ సినిమా మల్లూవుడ్ బాక్సాఫీస్ హిట్ టీ నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు చిరంజీవి. ఇదిలా ఉంటే ‘లూసిఫర్’ తర్వాత మరోసారి కలసి సినిమా చేస్తున్నారు మోహన్ లాల్, పృథ్వీరాజ్. ‘బ్రో డాడీ’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. 44 రోజుల పాటు ఏకధాటిగా జరిపిన షెడ్యూల్స్ తో సినిమాను పూర్తి…
టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో భారత తరఫున పాల్గొని తొలి స్వర్ణాన్ని గెలుచుకున్నాడు నీరజ్ చోప్రా. జావెలిన్ త్రోలో భారత్ కు దక్కిన తొలి స్వర్ణమిది. అంతేకాదు అధ్లెట్స్ విభాగంలోనూ భారత్ ఒలింపిక్స్ లో అందుకున్న మొట్టమొదటి బంగారు పతకం ఇది. ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు నీరజ్ చోప్రాపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. దక్షిణాదిలో చిరంజీవి, మోహన్ బాబు, మహేశ్ బాబు, మోహన్ లాల్, ఎస్.…
మలయాళీ సీనియర్ స్టార్ హీరోలకు తెలుగు సినిమా రంగంతోనూ, హైదరాబాద్ తోనూ గాఢానుబంధమే ఉంది. మోహన్ లాల్ ఈ మధ్య ‘జనతా గ్యారేజ్’తో పాటు ‘మనమంతా’ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించారు. ఇక మమ్ముట్టి అయితే ‘యాత్ర’ మూవీ చేశారు. విశేషం ఏమంటే… ఈ ఇద్దరు స్టార్ హీరోలు నటించే మలయాళ చిత్రాల షూటింగ్స్ సైతం హైదరాబాద్ లో జరుగుతూనే ఉంటాయి. తాజాగా ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ‘లూసిఫర్’ తర్వాత డైరెక్ట్ చేస్తున్న సెకండ్ మూవీ…
మోహన్ లాల్, మీనా లది మలయాళంలో సూపర్ హిట్ జోడి. ఈ మధ్య కాలంలో అయితే ‘దృశ్యం, దృశ్యం-2’లో వాళ్ళు జంటగా నటించారు. దానికి ముందు కూడా వాళ్ళిద్దరూ కలిసి దాదాపు ఆరేడు సినిమాల్లో నటించారు. ఇప్పుడు మరోసారి మోహన్ లాల్ మూవీ ‘బ్రో డాడీ’లో మీనా నటిస్తోంది. బహుశా ఇది వాళ్ళిదరికీ పదో చిత్రం కావచ్చు. అయితే మీనా… మోహన్ లాల్ కు జోడీగా నటిస్తోందా లేదా అనేది మాత్రం తెలియ రాలేదు. బుధవారం ‘బ్రో…
‘లూసిఫర్’ మూవీ తర్వాత మోహన్ లాల్ కథానాయకుడిగా యంగ్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ బ్రో డాడీ’. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ షూటింగ్ ఈ రోజు హైదరాబాద్ లో మొదలైంది. నిజానికి 45 రోజుల సింగిల్ షెడ్యూల్ లో ఈ మూవీని కేరళలో ప్లాన్ చేశారు. కానీ అక్కడి ప్రభుత్వం కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా తగ్గకపోవడంతో మూవీ షూటింగ్స్ కు అనుమతి ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో మొత్తం టీమ్…
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో నాల్గవ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. మూవీకి “12th మ్యాన్” అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు పోస్టర్ ద్వారా ప్రకటించారు. Read Also : “కిస్ మీ మోర్” అంటూ దిశా అట్రాక్టివ్ స్టెప్స్… వీడియో వైరల్ గతంలో మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కలిసి “దృశ్యం” చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఇటీవలే…
2013లో మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం’కు సీక్వెల్ గా ఈ యేడాది ‘దృశ్యం -2’ రూపుదిద్దుకుంది. నిజానికి ఈ సినిమాను కూడా థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు భావించినా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా అమెజాన్ ప్రైమ్ లో ఫిబ్రవరి 19న వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ చేశారు. స్టార్ హీరో మోహన్ లాల్ మూవీ ఇలా స్ట్రయిట్ గా ఓటీటీలో విడుదల కావడం ఇదే మొదటిసారి. తెలుగులో ఇప్పటికే వెంకటేశ్ ‘దృశ్యం’ను రీమేక్ చేశారు, ఇప్పుడు ‘దృశ్యం…
మలయాళ స్టార్ సురేష్ గోపి ఈ రోజు (జూన్ 26)న తన 63వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సురేష్ గోపి 251వ చిత్రం పోస్టర్ను ట్విట్టర్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ రిలీజ్ చేశారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం “ఎస్జీ 251” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి రాహుల్ రామచంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. పోస్టర్తో పాటు సురేష్ గోపికి మోహన్ లాల్ పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా…
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలిసి రెండవ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. 2019లో వీరిద్దరి కాంబినేషన్ లో “లూసిఫర్” అనే బ్లాక్ బస్టర్ రూపొందింది. ఈ చిత్రంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించగా పృథ్వీరాజ్ దర్శకత్వం వహించారు. ఈ స్టార్స్ మరోసారి “బ్రో డాడీ” కోసం కలిసి పని చేయబోతున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకున్న పృథ్వీరాజ్ ఈ చిత్రంలోని తారాగణం, సిబ్బందిని వెల్లడించారు.…
మోహన్లాల్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మరక్కర్’.. లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ అనేది టాగ్ లైన్.. ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. 16వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ సినిమా ఇటీవల ప్రకటించిన జాతీయ పురస్కారాల్లో పలు విభాగాల్లో విజేతగా నిలిచింది. ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. కరోనావల్ల ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. మలయాళంతోపాటు తెలుగు, హిందీ తదితర భాషల్లో ఆగస్టు 12న ఈ చిత్రాన్ని అధికారికంగా విడుదల చేయాలనుకున్నట్లుగా పోస్టర్…