కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నేడు (మే 21) తన 61వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. మలయాళ చిత్రసీమలోని ఉత్తమ నటులలో ఒకరైన మోహన్ లాల్ నాలుగు దశాబ్దాలుగా 300కి పైగా చిత్రాలలో నటించారు. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. మోహన్ లాల్ త్వరలో “ఆరట్టు” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. స్క్రీన్ రైటర్ ఉదయ్ కృష్ణ రాసిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, సిద్దిక్, నేదుముడి వేణు, సాయి కుమార్, స్వాసికా, రాచన నారాయణన్ కుట్టి కూడా…
మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న మలయాళ బిగ్‌బాస్ సీజన్ 3 షూటింగ్‌ను తమిళనాడు పోలీసు అధికారులు నిలిపివేశారు. చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్‌సిటీలో ఈ షో కోసం వేసిన షూటింగ్ సెట్‌ను సీజ్ చేశారు. కరోనా ఆంక్షలు ఉల్లంఘించి చిత్రీకరణ జరిపించారు. కాగా, బిగ్ బాస్ హౌస్ లో పనిచేసే వారిలో మొత్తం 6 మందికి కరోనా సోకింది. అయినా కూడా నిర్వాహకులు షోని నిలిపివేయకుండా రహస్యంగా కంటిన్యూ చేశారు. ఈ సమాచారం బయటకు రావడంతో…
లాక్ డౌన్ పుణ్యామా అని గత యేడాది చాలామంది ఫిల్మ్ సెలబ్రిటీస్ ఇంటికే పరిమితం అయిపోయారు. క్షణం తీరిక లేకుండా గడపడం అలవాటైన కొందరు సెలబ్రిటీస్ లాక్ డౌన్ టైమ్ ను కూడా బాగానే ఉపయోగించుకున్నారు. చాలామందిలానే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తాను దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ తో పాటు ఆర్గానిక్ ఫార్మింగ్ మీద దృష్టి పెట్టారు. ఎర్నాకుళం లోని తన ఇంటి పక్కనే ఉన్న విశాలమైన స్థలంలో…