నేడు సుప్రీంకోర్టులో మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. తాజాగా మోహన్ బాబు పిటిషన్‌పై హైకోర్టులో కూడా విచారణ జరిగింది. పహాడీషరీఫ్ పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగింది. సీనియర్ న్యాయవాది వాదిస్తాడని సమయం కావాలని మోహన్‌బాబు తరఫు న్యాయవాది కోరారు. తదుపరి విచారణ వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.