Manchu Manoj: మంచు వారబ్బాయి మంచు మనోజ్ త్వరలో తండ్రి కాబోతున్న విషయం తెల్సిందే. భూమా మౌనికను మనోజ్ ప్రేమించి, గతేడాది మార్చిలో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి అంతకుముందే వేరేవారితో పెళ్లి అయ్యింది. భూమా మౌనికకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆ కొడుకును కూడా మనోజ్ యాక్సెప్ట్ చేశాడు. ఆ చిన్నారి బాలుడును శివుడు తనకు బహుమతిగా ఇచ్చాడని మనోజ్ చెప్పుకొచ్చాడు.