ఐపీఎల్ 2025 లో భాగంగా 18వ సీజన్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. 18వ సీజన్‌కి ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అలాగే రెండో మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ , రాజస్థాన్ రాయల్స్ జట్లు ఉప్పల్ స్టేడియంలో తలపడనున్నాయి. అయితే గత సీజన్లో ఫైనల్ వరకు చేరుకొని రన్నరప్గా నిలిచిన హైదరాబాద్ జట్టు మ్యాచుల కోసం తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హెడ్ కోచ్ డేనియల్ వెటోరి మాట్లాడారు.
READ MORE: Husband Suicide: ‘‘నా చావుకు భార్య, అత్త కారణం’’.. వేధింపులకు మరో భర్త బలి..
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సారి మరింత పటిష్టంగా ఉన్నట్లు హెడ్ కోచ్ డేనియల్ వెటోరి వెల్లడించారు. బ్యాటింగ్ విభాగంలో ఇషాన్ కిషన్ చేరికతో జట్టు బలపడిందని, రేపటి మ్యాచ్‌కు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ చేయనున్నారని, ఫస్ట్ డౌన్‌లో ఇషాన్ కిషన్ బరిలోకి దిగుతారని వెటోరి తెలిపారు. గాయాల కారణంగా కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకున్న పాట్ కమ్మిన్స్, నితీష్ కుమార్ రెడ్డి మళ్లీ నెట్స్‌లో శ్రమిస్తున్నారని, వారు అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. బౌలింగ్ విభాగంలో కూడా జట్టు చాలా స్ట్రాంగ్‌గా ఉందని, మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్, పాట్ కమ్మిన్స్, నితీష్ కుమార్ రెడ్డిలు కీలకంగా ఉండబోతున్నారని చెప్పారు. గత సీజన్ ఫైనల్‌లో చేసిన తప్పిదాలను ఈ సారి పునరావృతం చేయబోమని, అద్భుత ప్రదర్శన కోసం జట్టు సిద్ధంగా ఉందని వెటోరి స్పష్టం చేశారు.