Ishan Kishan Captai For East Zone in Duleep Trophy 2025: దేశవాళీ క్రికెట్ పండుగకు సమయం ఆసన్నమైంది. దులీప్ ట్రోఫీ 2025 ఆగస్టు 28 నుంచి ప్రారంభమవుతుంది. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 11న జరుగుతుంది. ట్రోఫీ కొసం ఈస్ట్ జోన్ జట్టును ఈరోజు ప్రకటించారు. ఈస్ట్ జోన్ జట్టుకు టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతడికి డిప్యూటీగా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న అభిమన్యు ఈశ్వరన్ వ్యవహరించనున్నాడు. అభిమన్యు ఇంకా భారత్ అరంగేట్రం చేయని విషయం తెలిసిందే. ఈస్ట్ జోన్ జట్టులో ఐదుగురు టీమిండియా ప్లేయర్స్ ఉండడం విశేషం. ఇషాన్ సహా ముఖేష్ కుమార్, ఆకాశ్‌దీప్, మొహమ్మద్ షమీ, రియాన్ పరాగ్ జట్టులో ఉన్నారు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 12 సెంచరీలు చేసిన యువ బ్యాట్స్‌మన్ విరాట్ సింగ్ కూడా ఈస్ట్ జోన్ జట్టుకు ఎంపికయ్యాడు. అభిమన్యు ఈశ్వరన్ గత 10 టెస్టులకు టీమిండియాలో ఉన్నా ప్లేయింగ్ 11లో చోటు దక్కలేదు. ఇప్పుడు మరోసారి దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించి.. బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాలని చూస్తున్నాడు. ఫిట్‌నెస్ సమస్యలతో ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక కాని సీనియర్ పీసర్ మొహమ్మద్ షమీ ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ రియాన్ పరాగ్ కూడా ఉన్నాడు. ఇంగ్లండ్ కౌంటీల్లో విశేషంగా రాణించిన ఇషాన్ కిషన్.. ,మరలా జాతీయ జట్టులో చోటు కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇక యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్నాడు.
Also Read: Anil Ravipudi: నా కెరీర్‌లో చేసిన విభిన్న ప్రయత్నం.. నేషనల్ అవార్డుపై స్పందించిన అనిల్ రావిపూడి!
ఈస్ట్ జోన్ జట్టు:
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్/కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, సందీప్ పట్నిక్, విరాట్ సింగ్, డానిష్ దాస్, శ్రీరామ్ పాల్, శరణ్‌దీప్ సింగ్, కుమార్ కుషాగ్రా, రియాన్ పరాగ్, ఉత్కర్ష్ సింగ్, మనీషి, సూరజ్ జైస్వాల్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్, మహ్మద్ షమీ.
స్టాండ్‌బై ప్లేయర్‌లు:
ముఖ్తార్ హుస్సేన్, ఆశీర్వాద్ స్వైన్, వైభవ్ సూర్యవంశీ, స్వస్తిక్ సమాల్, సుదీప్ కుమార్ ఘరామి, రాహుల్ సింగ్.