అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో తుఫాన్ ఇన్నింగ్స్‌లు ఆడుతున్న టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మపై మాజీ భారత బ్యాటర్ మహమ్మద్ కైఫ్ ప్రశంసలు కురిపించారు. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ కన్నా అభిషేక్ విధ్వంసకరమైన ఆటగాడని పేర్కొన్నారు. అభిషేక్ ఆడితే భారత్ గెలవడం ఖాయం అని, టీమిండియాకు దొరికిన ఆణిముత్యం అని అని కైఫ్ చెప్పుకొచ్చారు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడవ టీ20లో అభిషేక్ చెలరేగాడు. 20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సులతో 68 రన్స్ చేసి నాటౌట్‌గా…