మాల్దీవులు ఇజ్రాయెల్ పౌరులు తమ దేశంలోకి ప్రవేశించడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పాలస్తీనాకు మద్దతుగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని సాకారం చేసేందుకు హిందూ మహాసముద్రంలో ఉన్న ఈ ద్వీప దేశం చట్టపరమైన సవరణలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇజ్రాయెల్ పౌరులు తమ దేశంలోకి రాకుండా ఆ దేశ మంత్రిమండలి ఆదివారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది.