శ్రీలంకతో జరిగిన మొహాలీ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. ఈ మ్యాచ్ రోహిత్ శర్మకు కెప్టెన్‌గా మొదటి మ్యాచ్. తొలి మ్యాచ్‌లోనే భారీ విజయం సాధించిన టీమిండియా టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మకు మధురానుభూతిని మిగిల్చింది. అయితే శ్రీలంకపై ఘనవిజయం సాధించినా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో భారత్ స్థానంలో మాత్రం ఎటువంటి మార్పూ రాలేదు. డబ్ల్యూటీసీలో భాగంగా టీమిండియా ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడగా వాటిలో…
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారీ విజయం సాధించి టీమిండియా తమ మాజీ సారథి విరాట్ కోహ్లీకి అదిరిపోయే కానుకను అందించింది. తద్వారా కోహ్లీ వందో టెస్టును టీమిండియా చిరస్మరణీయం చేసింది. అయితే భారత్, శ్రీలంక మధ్య జరిగిన తొలి టెస్టు పలు రికార్డులకు వేదికగా మారింది. ఆ రికార్డుల వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ★ కోహ్లీకి ఇది 100వ టెస్ట్ మ్యాచ్★ శ్రీలంకకు 300వ టెస్ట్ మ్యాచ్★ జడేజాకు అత్యధిక వ్యక్తిగత స్కోరు 175★…
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ టెస్టులో ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా (175 నాటౌట్) విజృంభించడంతో 574/8 భారీ స్కోరు చేసింది. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే ఆలౌట్ కావడంతో ఫాలో ఆన్‌లో పడింది. చాన్నాళ్ల తర్వాత శ్రీలంక జట్టును భారత్ ఫాలోఆన్ ఆడించింది. రెండో…
శ్రీలంకతో తొలి టెస్టులో జడేజా డబుల్ సెంచరీ ముంగిట ఉన్న సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంపై పలు విమర్శలు వచ్చాయి. కెరీర్‌లో జడేజా తొలిసారి డబుల్ సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పుడు రోహిత్ ఇలా చేయడం సరికాదనే కామెంట్లు వినిపించాయి. అయితే ఈ విమర్శలపై రవీంద్ర జడేజా స్పందించాడు. తానే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయమని రోహిత్‌కు చెప్పినట్లు జడేజా స్పష్టం చేశాడు. దీంతో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడింది. భారత్ 574…
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. టీమిండియా కంటే ఇంకా 466 పరుగులు వెనుకబడి ఉంది. భారత బౌలర్ల ధాటికి శ్రీలంక వెంట వెంటనే టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీయగా… రవీంద్ర జడేజా, బుమ్రా తలో వికెట్ తీశారు. కరుణరత్నే, తిరుమన్నే, ఎంజెలో మాథ్యూస్,…
మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 574/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భారీ సెంచరీ చేశాడు. 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే డబుల్ సెంచరీకి జడేజా 25 పరుగుల దూరంలో ఉన్న సమయంలో ఇన్నింగ్స్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ డిక్లేర్ చేయడంపై వివాదం చెలరేగింది. కెరీర్‌లో జడేజా తొలిసారి డబుల్ సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పుడు రోహిత్ ఇన్నింగ్స్ ఎలా డిక్లేర్ చేస్తాడని…
శ్రీలంకతో మార్చి 4 నుంచి ఆరంభమయ్యే తొలి టెస్టు టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీకి ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది. దానికి కారణం ఆ మ్యాచ్ ద్వారా కోహ్లీ టెస్టుల్లో 100వ మ్యాచ్ ఆడనున్నాడు. టెస్టుల్లో 100వ మ్యాచ్ ఆడటం ఏంటే ఎంతో ప్రత్యేకం. దిగ్గజ ప్లేయర్లకు సైతం టెస్టుల్లో 100 మ్యాచ్ ఆడటం సాధ్యం అయ్యే పని కాదు. అయితే శ్రీలంకతో జరిగే ఈ టెస్టు ద్వారా కోహ్లీ ఈ ఘనతను అందుకోనున్నాడు. ఈ నేపథ్యంలో విరాట్…