IND vs AUS 1st ODI Pitch Report and Live Streaming Details: స్వదేశంలో వన్డే ప్రపంచకప్ 2023కు ముందు భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మొహాలీ వేదికగా ఈరోజు మధ్యాహ్నం జరగనుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడంతో.. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ భారత సారథిగా వ్యవహరించనున్నాడు. రోహిత్ సహా విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలు…