Vishnu Vardhan Reddy: ప్రధాని మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో బీజేపీ కీలక నేతలందరూ విశాఖలోనే మకాం వేశారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు విష్ణువర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ లైన్, జనసేన లైన్ ఒక్కటేనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తాము సమర్థిస్తున్నామని విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. వైసీపీ వ్యతిరేక ఓటు టీడీపీకి వెళ్లకుండా చూసుకోవడమే బీజేపీ-జనసేన ముందున్న ఉమ్మడి లక్ష్యమని పేర్కొన్నారు.…
CPI Ramakrishna: ఈనెల 11, 12 తేదీల్లో విశాఖలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అమరావతిలో బుధవారం నాడు వామపక్ష పార్టీల నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. ఏపీని మోదీ అన్ని విధాలుగా మోసం చేసి సిగ్గు లేకుండా వస్తున్నారని.. ఒక్క అంశంలోనైనా మోదీ ప్రభుత్వం న్యాయం చేసిందా అని ప్రశ్నించారు.…
దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ రేపు గుజరాత్ లో పర్యటించనున్నారు. మోర్బీలో నెలకొల్పిన 108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని మోడీ ఆవిష్కరిస్తారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ‘హనుమాన్జీ4ధామ్’ప్రాజెక్ట్ లో భాగంగా దేశ నలు దిక్కుల్లో నాలుగు హనుమాన్ విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా దేశానికి పడమర దిక్కున ఉన్న మోర్బీలోని…
హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటనకు తెలంగాణ సీఎం కేసీఆర్ దూరంగా ఉండటంతో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. #ShameOnYouKCR పేరుతో బీజేపీ నేతలు ఆరోపిస్తుంటే… #EqualityforTelangana పేరుతో టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ రెండు హ్యాష్‌ట్యాగ్‌లు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయంటే.. బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య వార్ ఏ రేంజ్‌లో నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేశారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ పట్ల…