Mobile Games: ప్రస్తుతం మొబైల్ ఫోన్లు మన శరీరంలో ఓ భాగం అనేంతగా మారాయి. ఎల్లప్పుడూ మనం మొబైల్ ఫోన్లను పట్టుకూనే ఉంటున్నాయి. ప్రతీ ఒక్క పని మొబైల్ లో ముడిపడి ఉంది. ఇదిలా ఉంటే కొంత మంది మాత్రం మొబైల్ ఫోన్లలో గేమ్స్ కి ఎక్కువగా అలవాటు పడుతున్నారు.
Gaming Addiction:మొబైల్ గేమింగ్ ఎంత ప్రమాదకరం ఇటీవల కొన్ని సంఘటనలు తెలియజేస్తున్నాయి. ఈ గేమింగ్స్ కు పిల్లలు బానిస అవుతున్నారు. తల్లిదండ్రలుకు తెలియకుండా వారి ఖాతాల నుంచి డబ్బులు గేమ్స్ కోసం తగలేస్తున్నారు. ఇటు ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యంగా తీవ్రం నష్టపోతున్నారు.
ఆన్ లైన్ గేమ్స్ కు బానిస అవుతూ చాాలా మంది పిల్లలు మానసిక రోగాలకు గురవుతున్నారు. కొంత మంది ప్రాణాలు తీసుకునే స్థితికి వెళ్లిపోతున్నారు. ఇంతలా గేమ్స్ పిల్లల్ని ప్రభావితం చేస్తున్నాయి. తల్లిదండ్రులకు తెలియకుండా అప్పులు చేస్తున్నవారు ఎందరో ఉన్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల చాలా చోట్ల వినిపిస్తూనే ఉన్న�