ఆన్ లైన్ గేమ్స్ కు బానిస అవుతూ చాాలా మంది పిల్లలు మానసిక రోగాలకు గురవుతున్నారు. కొంత మంది ప్రాణాలు తీసుకునే స్థితికి వెళ్లిపోతున్నారు. ఇంతలా గేమ్స్ పిల్లల్ని ప్రభావితం చేస్తున్నాయి. తల్లిదండ్రులకు తెలియకుండా అప్పులు చేస్తున్నవారు ఎందరో ఉన్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల చాలా చోట్ల వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఆన్ లైన్ గేమ్స్ కు బానిస అయిన ఓ పిల్లాడు ఏకంగా తల్లి అకౌంట్ లో డబ్బులు లేకుండా చేశాడు.
వివరాల్లోకి వెళితే అంబర్ పేటకు చెందిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 16 ఏళ్ల పిల్లాడు మొబైల్ ఫోన్ లో ‘ఫ్రీ ఫైర్’ గేమ్ ఆడుతూ.. ఎకౌంట్ లోని డబ్బులను స్వాహా చేశాడు. ఆన్ లైన్ గేమ్స్ కోసం తన తల్లి అకౌంట్ ను లింక్ చేసి గేమ్ తాత మొబైల్ ఫోన్ లో గేమ్స్ ఆడాడు. అయితే ఇటీవల తల్లి తన బ్యాంకు నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు వెళ్లిన సమయంలో అకౌంట్ లో డబ్బులు లేవని బ్యాంకు అధికారులు షాకింగ్ న్యూస్ చెప్పారు.
బాలుడి తల్లి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నుంచి రూ. 27 లక్షలు మాయమయ్యాయి. దీంతో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి రూ. 9 లక్షలు ఖర్చయినట్టుగా బ్యాంకు అధికారులు తెలిపారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది.
మొదటగా ఫ్రీఫైర్ గేమ్ ఆడటం కోసం రూ. 1500 నుంచి రూ. 10000 వేల వరకు తల్లి బ్యాంక్ అకౌంట్ నుంచి ఉపయోగించాడు. ఆ తరువాత తాత, తల్లికి తెలియకుండా.. రూ. 1.45 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు ఖర్చు చేస్తూనే ఉన్నాడు. దీంతో తల్లి రెండు బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ. 36లక్షల పొగొట్టాడు. మరణించిన తన భర్త కష్టపడి సంపాదించన డబ్బులని పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది. బాలుడి తండ్రి మరణించిన తర్వాత వచ్చిన బెనిఫిట్స్ ఆన్ లైన గేమ్ ద్వారా పొయ్యాయి.