మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు.. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి. ఇద్దరూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు. వేర్వేరు వర్గాలు. తూర్పు.. పడమర ప్రాంతాలకు చెందిన నాయకులు. మహేశ్వర్‌రెడ్డి ప్రస్తుతం AICC కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఇన్నాళ్లూ అంతర్గత కలహాలతో ఎడముఖం పెడముఖంగా ఉన్న ఇద్దరూ.. ప్రస్తుతం యుగళగీతం ఆలపించడం పార్టీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. అధిష్ఠానం ఒత్తిడో ఏమో ఇద్దరూ ఒకే లైన్‌లోకి వచ్చారు. ఇలాంటి సమయంలో ప్రేమ్ సాగర్‌రావు చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.…