చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడానికి మహిళా బిల్లును తీసుకురావాలంటూ కల్వకుంట్ల కవిత ఉద్యమాన్ని ఉదృతం చేశారు. ఇప్పటికే జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేయడంతోపాటు దాదాపు 18 పార్టీలతో, ఆయా మహిళా, సంఘాలతో సంఘాలతో భారత్ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన విషయం విధితమే.
బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. రాజగోపాల్ అన్న తొందరపడకు, మాట జారకు అంటూ కవిత ట్వీట్ చేశారు. ఈడీ ఛార్జిషీట్‌లో 28 సార్లు తన పేరు చెప్పించినా.. 28 వేల సార్లు చెప్పించినా అబద్ధం నిజం కాదని ట్విటర్ వేదికగా వెల్లడించారు.