కుప్పం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నియమించిన ప్రత్యేక ఎన్నికల అధికారిని తొలగించాలని టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్‌ఈసీ) ను కోరారు. శుక్రవారం టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎమ్మెల్సీ అశోక్ బాబులతో కూడిన టీడీపీ బృందం ఎస్‌ఈసీని కలిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నామినేషన్ల పర్వంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, అధికార పార్టీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని, ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు.…