టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య జైళ్ళ శాఖ డీజీకి లేఖ రాశారు. న్యాయమూర్తి ఆదేశాలు లేకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ ఎమ్మెల్సీ అనంతబాబుకు వీఐపీ సౌకర్యాలు కల్పిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. పెద్ద నేరస్తుడికి రాజమండ్రి సెంట్రల్ జైలు సిబ్బంది, అధికారులు స్టార్ హోటల్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. రిమాండ్ ఖైదీకి అటువంటి సౌకర్యాలు కల్పించేందుకు అనుమతి ఇవ్వలేదని కోర్టు అధికారులు చెప్తున్నారు.నిబంధనలకు విరుద్ధంగా అనంతబాబుకు ప్రత్యేక గది కేటాయించి, రెండు సెల్‌ఫోన్లతో నిత్యం…