కావాలంటే రాష్ట్రాన్నే రాసిస్తా… అన్నది ఓ హిట్ మూవీలో మినిస్టర్ కేరక్టర్ పాపులర్ డైలాగ్. ఆ సినిమాని ఎక్కువ సార్లు చూశారో… లేక డైలాగ్‌ని బాగా… ఒంటబట్టించుకున్నారోగానీ… ఆ శాసనసభ్యురాలు నిజంగానే నియోజకవర్గాన్ని సోదరులకు రాసిచ్చేశారట. తాను మాత్రం రిబ్బన్లు కత్తింరించుకుంటూ… బ్రదర్స్ ఇద్దర్నీ నియోజకవర్గం మీదికి వదిలేశారట. జనరల్‌గా దోచుకో, పంచుకో అంటుంటారు. వాళ్ళు మాత్రం పంచుకో దోచుకో అన్న ఫార్ములాని ఫాలో అవుతున్నార. ఇంతకీ ఎవరా నామమాత్రపు ఎమ్మెల్యే? ఏంటా బ్రదర్స్ దోపిడీ కహానీ?…