Narayanaswamy vs Thomas: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే థామస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. దళితులపై కూటమీ ప్రభుత్వం దాడులు కొనసాగుతున్నాయని.. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన వ్యక్తిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తే దళితుడైన నాపైన అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి… ఎమ్మెల్యే థామస్ అసలు దళితుడే కాదని కోట్లాది రూపాయల ప్రకృతి సంపదను నియోజవర్గంలో దోచుకుంటున్నాడంటూ…
మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పై హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే డాక్టర్ థామస్.. చిత్తూరు జిల్లా వెదరు కుప్పం మండలంలో 395 మహిళా సంఘాలకు 61 కోటి 95 లక్షల నిధుల చెక్కును పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ థామస్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోరే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు.