ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో ఒక్కసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. వైసీపీ గ్రామ అధ్యక్షుడు గంజి ప్రసాద్ హత్యతో గ్రామం అట్టుడికిపోగా.. హత్యకు గురైన గంజి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావును గ్రామస్తులు తరమడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.. ఎమ్మెల్యే తలారిని తరిమికొట్టింది వైసీపీలోని మరో వర్గం అనే ప్రచారం సాగుతుండగా.. ఈ ఘటనపై స్పందించిన ఆయన.. జి.కొత్తపల్లిలో తనపై దాడి చేసింది వైసీపీ కార్యకర్తలు కాదని స్పష్టం చేశారు.…