Off The Record: ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఈవో గీతారెడ్డి మధ్య గ్యాప్ పెరిగిందా అంటే… ఎస్.. అంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. ఆలయ పునర్నిర్మాణం, స్వయంభూ దర్శనాలు ప్రారంభమయ్యాక ఇక్కడ స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మరింత పెరుగుతాయని ఆశిస్తే… సీన్ రివర్స్ అయిందట. అదే ఇద్దరి మధ్య మనస్పర్ధలకు కారణం అవుతోందట. దీనికి తోడు ఆలయ పునర్ నిర్మాణ పనులు ప్రారంభమైన నాటి…
యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయం కొసం ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహారిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మండలాలపై పట్టు సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఎమ్మెల్యే. అయితే ఆమె చర్యలు పార్టీ కేడర్‌లో అసంతృప్తికి కారణం అవుతున్నాయట. చాలాకాలంగా ఎమ్మెల్యే సునీతా ఆమె భర్త నల్లగొండ DCCB ఛైర్మన్ మహేందర్ రెడ్డిలు మండలాల వారీగా సీనియర్లను కాదని మరికొందరిని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అధికారపార్టీలో మొదటి నుంచి ఉన్న…