Off The Record: సినీ సెలబ్రెటీలతో పొలిటికల్ లీడర్స్‌కు స్నేహమో.. బంధుత్వమో ఉండటం సహజం. ఆ విషయం ముందుగానే జనానికి తెలిస్తే అందులో ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. ఏదేనీ ఫంక్షన్‌కు లీడర్స్ వస్తే వచ్చారని అనుకుంటారు.. రాకపోతే ఎందుకు రాలేదు అని ఎవరికి తోచిన విధంగా వాళ్లు ఆరా తీస్తారు. అదే.. హీరోలకు.. పొలిటికల్ లీడర్స్‌కు ఉన్న సాన్నిహిత్యంపై ఎలాంటి లీకులు లేకుండా.. ఒకే ఫ్రేమ్‌లో పదే పదే తళుక్కుమంటే చర్చగా మారడం ఖాయం. హీరో…
ఇవాళ రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు వెళతారా అనే ఉత్కంఠం రేపుతున్న నేపథ్యంలో రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు గైర్హాజరు పై సర్వత్రా చర్చకు దారితీసింది. ఈడీ విచారణకు గైర్హాజరుపై రోహిత్ రెడ్డి వివరణ ఇచ్చారు. నిన్న హైకోర్టులో పిటిషన్ వేశానన్నారు. రేపు పిటిషన్ బెంచ్ మీదకు వస్తుందని తెలిపారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకంగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేయడంతో BRS- BJP మధ్య రాజకీయం మరింత హీటెక్కింది. వ్యాపార, బ్యాంకు లావాదేవీల సమాచారంతో రావాలని కోరింది ED. అయితే ఏ కేసులో ఈ సమన్లు జారీ చేశారన్నది స్పష్టత లేదంటున్నారు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి. పైగా ఈడీ నోటీసుల వెనుక మతలబేంటి అని లెక్కలు వేసుకుంటున్నారట. ఈడీ నోటీసులు.. ఈడీ ఎదుట హాజరు కావడం ఎలా ఉన్నా.. ఇది…
వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేరు తెలంగాణ రాజకీయాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చగా మారింది.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఆయన ఫామ్‌హౌస్‌లోనే జరగడంతో.. అందరి దృష్టి ఆయనపైనే పడింది.. ప్రభుత్వం ఆయనకు భద్రతను కూడా పెంచింది.. అయితే, ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి కనిపించడం లేదంటూ తాండూరు టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందిందింది.. గత 20 రోజుల నుంచి మా ఎమ్మెల్యే కనిపించడంలేదు.. మిస్సింగ్ అయ్యారా? ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేదా ఇంకా…
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు యత్నించిన వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు.. అయితే, ఆ నలుగురిలో ఒకరైన తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు రంగ ప్రవేశం చేసినట్టు చెబుతున్నారు.. మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.. దీంతో.. కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.. ఇంతకీ రోహిత్ రెడ్డి చేసిన…
ఫస్ట్ వేవ్‌లోనే చాలా మంది ప్రజాప్రతినిధులను పలకరించిపోయింది కరోనా మహమ్మారి.. కొందరు నేతలు, ప్రముఖుల ప్రాణాలు సైతం తీసింది.. తాజాగా, సెకండ్ వేవ్ కలవర పెడుతుండగా.. మరో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు.. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఇవాళ ఆయన కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. దీంతో.. ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, వైద్యుల సూచన…