Pilot Rohit Reddy : మా ఎమ్మెల్యే కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు.. కిడ్నాప్ చేశారా? నిర్బంధించారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేరు తెలంగాణ రాజకీయాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చగా మారింది.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఆయన ఫామ్‌హౌస్‌లోనే జరగడంతో.. అందరి దృష్టి ఆయనపైనే పడింది.. ప్రభుత్వం ఆయనకు భద్రతను కూడా పెంచింది.. అయితే, ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి కనిపించడం లేదంటూ తాండూరు టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందిందింది.. గత 20 రోజుల నుంచి మా ఎమ్మెల్యే కనిపించడంలేదు.. మిస్సింగ్ అయ్యారా? ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేదా ఇంకా ఎవరైనా నిర్బంధించారా? అనే విషయాన్ని వెంటనే తేల్చాలంటూ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి.. గత 20 రోజుల నుంచి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే లేరు.. ప్రజలు పలు రకాల సమస్యలతో నియోజకవర్గంలో సతమతమవుతున్నారని వాపోయారు.. ఎమ్మెల్యేను ఎవరైనా బంధించారా లేదా కిడ్నాప్ చేశారా నిర్బంధించారా అనే విషయం స్పష్టం చేయాలంటూ తాండూర్ పోలీసులకు కోరారు రామ్మోహన్ రెడ్డి.
Read Also: Mahesh Babu: బాధ నుంచి బయట పడడానికి ఎన్టీఆర్ బాటలో మహేశ్..
Also Read
కాగా, నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం తెలంగాణలో సంచలనం సృష్టించింది.. ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజులను డబ్బు ఆశ చూపి ప్రలోభపెట్టి , పార్టీ ఫిరాయింపు చేయాలని ప్రయత్నం జరిగినట్టు ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. నందకుమార్, రామచంద్ర భారతి, సింహయాజీ స్వామీజీలు ఎమ్మెల్యేలను ఫిరాయింపుకు ప్రోత్సహించినట్లు, వారితో మాట్లాడిన ఆడియోలు, వీడియోలు కలకలం రేపాయి. ఆ తర్వాత వారిపై కేసు నమోదు కావడం, కోర్టులలో కేసులు సంచలన విచారణ, ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం, ప్రస్తుతం ఈ కేసులో సిట్ దూకుడు పెంచడం ఆసక్తికరంగా మారిన విషయం విదితమే. మరోవైపు, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆ మధ్య షాకింగ్ కామెంట్లు చేశారు.. తన నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తాను ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రిస్కు తీసుకున్నానని, లేదంటే 100 కోట్లు తీసుకుని నేను హ్యాపీగా ఉంటాను కదా అంటూ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
Ramayana Part 1 Title: రణ్‌బీర్ కపూర్ బర్త్‌డే సర్ప్రైజ్.. ‘రామాయణ’ పార్ట్ 1 టైటిల్ ఇదే!
-
Share Nani: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!