అమరావతిలో వైఎస్సార్సీపీలో భారీ చేరికలు కొనసాగుతున్నాయి. ఇటీవల ముస్లిం మైనారిటీ సోదరులు భారీ ఎత్తున పార్టీలో చేరగా.. ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందిన 35 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి.
గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి, అందిన సంక్షేమాన్ని చూసి ఒక్కసారి తనకు ఓటు వేస్తే.. ఐదేళ్లు ప్రజల కోసం పనిచేస్తానని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు.