నడిగడ్డ ప్రాంతంగా పిలుచుకునే గద్వాల రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటాయి. జెండాలు, అజెండాలు మారిపోయినా, ప్రభుత్వాలు మారినా గద్వాల పాలిటిక్స్‌లో వేడి మాత్రం తగ్గదు. ఇలాంటి వాతావరణంలో తాజాగా మారుతున్న పరిణామాలతో గద్వాల పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు గద్వాల జడ్పీ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్న సరితా తిరుపతయ్య కారు దిగి కాంగ్రెస్ లో చేరిపోయారు. గద్వాల ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుని బరిలో నిలిచిన సరిత, బిఆర్ఎస్ అభ్యర్ది క్రిష్ణమోహన్…
గద్వాల.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నడిగడ్డగా పిలిచే ప్రాంతం. ఇక్కడి రాజకీయం ఓ పట్టాన అంతుబట్టదు. రాష్ట్ర రాజకీయం అంతా ఒకలా ఉంటే గద్వాల రాజకీయం మరోలా ఉంటుంది. గతంలో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలేవి. తాజాగా స్వపక్షంలోనే విపక్షం పుట్టుకొచ్చింది. అదను చూసి అప్పర్ హ్యండ్ కోసం ఎత్తులు.. పైఎత్తులు వేస్తున్న పరిస్థితి అధికారపార్టీలో కనిపిస్తోంది. అయితే నేతల మధ్య ఆధిపత్యపోరులో నియోజకవర్గంలోని అధికారులు నలిగిపోతున్నారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్ సరితా…
అక్కడ కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అత్తా అల్లుళ్ల మధ్య వార్ రాజుకుంది. పంతం నెగ్గించుకునేందుకు ఒకరు.. పట్టు సడలకుండా ఇంకొకరు పొలిటికల్ పన్నాగాలు పన్నుతున్నారు. ఎవరు వాళ్లు? ఏంటా రాజకీయ యుద్ధం? గద్వాలలో డీకే అరుణ వర్సెస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి..! నడిగడ్డగా పిలిచే గద్వాల రాజకీయం ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. అది రాష్ట్ర రాజకీయమైనా.. స్థానిక సమస్య అయినా నేతల మధ్య మాటల తూటాలు పేలుతాయి. అలాంటిది గద్వాల కొంతకాలంగా పొలిటికల్‌గా సైలెంట్.…