గెలిచాక ఎమ్మెల్యే ఇంటూరి ఓ గ్రూపును దూరం పెడుతున్నారనే టాక్ గట్టిగానే వినిపిస్తుందట నియోజకవర్గంలో. సొంత పార్టీ క్యాడర్‌ను పక్కన పెట్టి తన మనుషుల్ని మండలానికో ఇంచార్జ్‌గా నియమించుకున్నారట. అక్కడ ఎంతటి నాయకులైనా వారు చెప్పినట్లు నడుచుకోవాల్సిందేనట. ఇంటూరి పెట్టిన మనుషులకు తెలియకుండా... చీమ చిటుక్కుమనడానికి వీల్లేదన్నది లోకల్ టాక్. అదే సమయంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరారవును టార్గెట్ చేస్తూ కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో సొంత పార్టీ కార్యకర్తలే పోస్టింగులు పెట్టడం నియోజకవర్గంలో చర్చనీయంశమైంది.