ఏపీలో వైసీపీ నేతలు టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం రంజుగా సాగుతోంది. టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే గణేష్. నిరంతరం ప్రభుత్వం మీద ఏదోవిధంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ముఖ్యమంత్రిని విమర్శించే అర్హత అయ్యన్నకు లేదన్నారు. విలేఖర్లకు పంపిన వీడియోలో టీడీపీ నేతలపై ఎమ్మెల్యే గణేష్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంజూరైన ఇళ్లకు కేవలం రూ. 12 కోట్లు మీరు బిల్లులు చేస్తే, మా ప్రభుత్వంలో…