తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతూనే వుంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. ప్రధానిని విమర్శించొద్దు అన్న కేసీఆర్ ఇప్పుడు అదే ప్రధాని పైన నీచాటినీచంగా మాట్లాడుతున్నారన్నారు. 1985 నుండి 2018 వరకు ఒక్కసారి ఓడిపోని వ్యక్తికి పీకే అవసరం ఎందుకు వచ్చిందన్నారు. ప్రజల నాడీ తెలియదా… నా కుట్రలు కుతంత్రాలు నడవడం లేదని.. పీకేను తెచ్చుకున్నారు. పీకే కన్నా మేధావులు తెలంగాణ ప్రజలు.దుబ్బాకలో బీజేపీ గెలిచింది, హుజూరా…