పార్లమెంట్ కి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఐటి మినిస్టర్ కేటిఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట చౌరస్తాలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
తెలంగాణలో నిరుద్యోగులకు మంచి రోజులు రానున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సుమారు లక్ష ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఉద్యోగాల ప్రకటనకు హర్షం వ్యక్తం చేస్తూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో సంబురాలు అంబరాన్నంటాయి. ఎమ్మెల్యే దానం నాగేందర్ డ్యాన్స్ చేశారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు మార్చి9 వ తేదీ అన్నారు దానం. నిరుద్యోగులను కాంగ్రెస్, బీజేపీలు ఉసిగొల్పాయి. సీఎం కేసీఆర్…
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలవడంతో టీఆర్‌ఎస్ భవన్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ సంబరాల్లో డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు ఇతర పార్టీ నేతలు సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ… ప్రతి పక్షాలు సంఖ్యా బలం లేకున్నా పోటీ చేశాయన్నారు. ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేసి ఏదో రకంగా గెలవాలని చూశాయన్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు మాకు కావాలని దేశ వ్యాప్తంగా ప్రజలు…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ టీఆర్‌ఎస్ పార్టీ ధర్నాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలనే ముఖ్య డిమాండ్ తో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల తరఫున టీఆర్‌ఎస్ పార్టీ ధర్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే… ఖైరతాబాద్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే… దానం నాగేందర్.. తన నియోజక వర్గం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఖైరతాబాద్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే… దానం…
టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ప్రజా ప్రతినిధుల కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది… 2015లో జరిగిన ఘర్షణ కేసులో తీర్పు వెలువరించిన కోర్టు.. దానం నాగేందర్‌కు వెయ్యి రూపాయాలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది.. 2015లో జరిగిన ఘర్షణ కేసులో ఇవాళ హైదరాబాద్ జిల్లా మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టులోని ఎంపీ మరియు ఎమ్మెల్యేల స్పెషల్ సెషన్ కోర్టులో విచారణ జరిగింది.. యూ/ఎస్ 323,506 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ ప్రకారం బంజారా హిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసు విచారణ పూర్తి…
రేవంత్ రెడ్డిపై టిఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. కొత్త బిచ్చగాళ్ళు కెసిఆర్ నుంచి గుంజుకునుడే అంటున్నారని.. గుంజుకోవడానికి ఎవని అబ్బ సొత్తు కాదని..వాని అబ్బ సొత్తు అసలే కాదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మూతి లేదు తోక లేదు అన్నట్టు ఉంది రేవంత్ తీరు ఉందన్నారు. తాను పార్టీ మారుతున్నట్టు ప్రచారం చేసిన వారి పై సైబర్ క్రైమ్స్ విభాగానికి ఫిర్యాదు చేశానని…చివరి శ్వాస ఉన్నంత వరకు టీఆర్ఎస్ తోనే ఉంటానని ప్రకటించారు దానం.…