MLA Dharma Reddy: తెలంగాణ అంతా మన వైపు చూసేలా భారీ మెజారిటీతో గెలిపించాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం సీఎం కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యం అని చల్లా ధర్మారెడ్డి అన్నారు.
వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం పెంచికలపేట గ్రామంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సతీమణి జ్యోతి గడపగడపకు తిరిగి ఓట్లు అభ్యర్థించారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూడండి.. బీఆర్‌ఎస్‌ను గెలిపించి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని ఆమె కోరారు.
వరంగల్ జిల్లాలో బీఆర్‌ఎస్ నేతలకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల మంత్రి కేటీఆర్‌పై కొండా మురళి చేసిన వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మరెడ్డి కౌంటర్ ఇచ్చారు.
అక్కంపేట రచ్చబండలో భాగంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కౌంటర్ ఇచ్చారు. పార్టీ ఉనికి కాపాడుకోవడం కోసం రేవంత్ జోకర్ మాటలు మాట్లాడుతున్నారని, జయశంకర్ సార్ గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ బండికి జయశంకర్, కేసిఆర్‌లు జొడెడ్లలాగా పన�