లోక్‌సభ సభ్యుడు.... తన నియోజక వర్గంలో ఎక్కడైనా సరే.. ఎమ్మెల్యేలకు ముందస్తు సమాచారం ఇచ్చి తిరగొచ్చు. సొంత పార్టీ ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా చెప్పాలి. ఉద్దేశ్యపూర్వకంగా గొడవ పెట్టుకోవాలనుకుంటే తప్ప.. సాధారణంగా లొల్లి ఎందుకులే అనుకుంటూ అందర్నీ కలుపుకుని పోతుంటారు ఎంపీలు. కానీ.... నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవికి ఇప్పుడో చిక్కొచ్చి పడిందట.
జోగులాంబ గద్వాలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నట్టు వార్తలు వచ్చాయి… టీఆర్ఎస్, బీజేపీ నేతల పోటాపోటీ నినాదాలు, కారు ధ్వంసం చేయడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. పోలీసుల జోక్యంతో వివాదం ముగిసింది.. అయితే, ఈ ఘటనపై స్పందించిన గద్వాల జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి.. అసలు తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను మేం అడ్డుకోలేదు.. టీఆర్ఎస్‌కు…